'టీటీడీపై ఫేక్ ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు'

AP: భవిష్యత్తులో ఎవరైనా సరే టీటీడీపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. క్రిమినల్ చర్యలు తీసుకునేలా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డులో గట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తిరుమల క్షేత్రంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు మాటలు మాట్లాడడం మంచిది కాదన్నారు.