'ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం'
GNTR: పొన్నూరులో దళిత వైసీపీ కార్యకర్తలపై దాడిని పార్టీ నేత అంబటి మురళీకృష్ణ ఖండించారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల అనుచరుల దాడిలో నలుగురికి గాయాలయ్యాయన్నారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు రోజుల్లో అరెస్ట్ చేయకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులకు తాము భయపడేది లేదన్నారు.