PMAY గృహాలను ప్రారంభించిన కూటమి నేతలు

PMAY గృహాలను ప్రారంభించిన కూటమి నేతలు

కృష్ణా: ప్రజల సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూటమి నేతలు అన్నారు. సీఎం చంద్రబాబు రాయచోటిలో 3,00,192 గృహ ప్రవేశాల ప్రారంభోత్సవ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో గుడివాడ మండలం తట్టివర్రు గ్రామంలో పీఎంఏవై అర్బన్ 1.0 పథకం కింద మత్తె నాగతార నిర్మించుకున్న ఇంటిని కూటమి నేతలు జగన్‌మోహన్ రావు, బూరగడ్డ శ్రీకాంత్ బుధవారం ప్రారంభించారు.