నేడు ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరం

నేడు ధర్మవరం పట్టణంలో రక్తదాన శిబిరం

SS: ధర్మవరం పట్టణంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా మంగళవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేయాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు.