ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికీ అత్యవసరం: ఆది శ్రీనివాస్

ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికీ అత్యవసరం: ఆది శ్రీనివాస్

TG: నేటి సమాజంలో ఆత్మరక్షణ ప్రతి ఒక్కరికీ అత్యవసరమైందని, ముఖ్యంగా విద్యార్థులు కరాటే వంటివి నేర్చుకోవడం మంచిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన కరాటే సర్టిఫికెట్ల ప్రధానోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరాటే కేవలం పోరాట విద్య మాత్రమే కాకుండా శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, ఏకాగ్రతను పెంచుతుందని తెలిపారు.