'పట్టణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు పెట్టాలి'

అనంతపురం: జిల్లాలో కరువు తీవ్రంగా ఉన్నందున పట్టణ ప్రాంతాల్లో జాతీయ ఉపాధి హామీ పనులు పెట్టాలని సీపీఎం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు సహాయక చర్యలు చేపట్లేదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వి. రాంభూపాల్ విమర్శించారు.