'నేడు, రేపు నగరంలో తాగునీటి సరఫరా బంద్'
శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా మంగళ, బుధ వారాలలో తాగునీటి సరఫరా జరగదని కమిషనర్ పీవీవీడీ. ప్రసాదరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల వీధి, కాకి వీధి, గూన పాలెం, పీ ఎన్ కాలనీ, మహాలక్ష్మి నగర్ కాలనీ తదితర ప్రాంతాలలో నీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.