జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం

జియాగూడలో భారీ అగ్ని ప్రమాదం

HYD: జియాగూడలోని ఓ పాన్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చూస్తుండగానే ఎగిసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గూరయ్యారు. సంఘటన స్థలానికి అగ్ని మాపక సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.