పేదరిక నిర్మూలనకు దాతల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకం
కృష్ణా: పేదరిక నిర్మూలనకు దాతల భాగస్వామ్యం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డ రెవిన్యూ హాలులో పీ-4 ఆకాంక్ష నుంచి సాధన స్వర్ణ ఆంధ్ర-2047 సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ-4 కార్యక్రమం సమాజంలో పేదల అవసరాలు తీర్చేలా సాగటంతో పాటు అభివృద్ధిలోనూ భాగస్వామ్యం వహిస్తోందన్నారు.