జిల్లాలో పురుషుల బాక్సింగ్ జట్టు ఎంపిక ట్రయల్స్

జిల్లాలో పురుషుల బాక్సింగ్ జట్టు ఎంపిక ట్రయల్స్

RR: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ పురుషుల బాక్సింగ్ జట్టు ఎంపిక ట్రయల్స్ శనివారం నిర్వహించారు. స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ ఎన్‌.ఎస్‌. దిలీప్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం కొనసాగింది. వివిధ కళాశాలల నుంచి 60 మంది బాక్సర్లు ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నారు. సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ డా. సోమేశ్వర్ రావుతో పాటు పలువురు కాలేజీల ప్రతినిధులు హాజరయ్యారు.