రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న చర్యలు

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న చర్యలు

KDP: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం 'స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో' కార్యక్రమాన్ని పోలీసులు కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి తర్వాత డ్రైవర్లను ఆపి ముఖం కడిగించి మేల్కొలిపి, జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సూచిస్తున్నారు. నిద్రమత్తు వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. లారీలు, బస్సులు, కార్లు వంటి వాహనాల డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు.