VIDEO: పేకాట శిబిరాలపై డ్రోన్ నిఘా

VIDEO: పేకాట శిబిరాలపై డ్రోన్ నిఘా

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామ శివారు ప్రాంతాలైన గ్రామాలలో రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై డ్రోన్ తనిఖీలు చేపట్టారు. ఎరకన్నపాలెం, బంగారారయ్యపాలెం గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై రాజారావుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. అసాంఘిక కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.