సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

సంక్షేమ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం సహించం: కలెక్టర్

KRNL: జిల్లా సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ డా. ఏ. సిరి ఆదేశించారు. విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని, హాస్టళ్లలో పరిశుభ్రత, వంటగది హైజీన్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. తాజా కూరగాయలతో వేడి భోజనం అందించి, తాగునీటి ట్యాంకులను శుభ్రంగా ఉంచాలని ఆమె అన్నారు.