VIDEO: వ్రత ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

KKD: పిఠాపురం పాదగయ క్షేత్రంలో రేపు జరగనున్న సామూహిక వరలక్ష్మి వ్రత ఏర్పాట్లను కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందు మాధవ్ గురువారం పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్ల ఏర్పాటు, పోలీస్ బందోబస్తుపై స్థానిక అధికారులకు సూచనలు చేశారు. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.