రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

ATP: పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు గ్రామ సమీపంలోని 63వ నెంబర్ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జగన్‌మోహన్ రెడ్డి శుక్రవారం కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పని నిమిత్తం యాడికి వెళ్లి తిరిగి వస్తుండగా ఆటో ఢీకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.