గొడవ పడి వచ్చిన యువకుడిని అప్పగించిన పోలీసులు

గొడవ పడి వచ్చిన యువకుడిని  అప్పగించిన పోలీసులు

MDK: తల్లిదండ్రులతో గొడవ పడి వచ్చిన యువకుడిని గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించినట్లు మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లిలో కార్డెన్ సర్చ్ నిర్వహించగా నంద్యాల జిల్లా ఓబులదేవరపల్లికి చెందిన రామానాయుడు (19) అనుమానాస్పదంగా కనిపించడంతో విచారించగా తల్లిదండ్రులతో గొడవపడి వచ్చినట్లు గుర్తించారు. దీంతో తండ్రి వెంకటేష్‌ను రప్పించి యువకుడిని అప్పగించారు.