ఎంవీపీ రైతు బజార్‌లో స్వాతంత్య్ర వేడుకలు

VSP: విశాఖలోని ఎంవీపీ రైతు బజార్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విశేష సంఖ్యలో ప్రజలు, వ్యాపారులు, అధికారులు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు రైతు బజార్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకున్నారు.