అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దుండగుడు అరెస్ట్

అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల దుండగుడు అరెస్ట్

ATP: రాయదుర్గం పట్టణంలో అంతర్రాష్ట్ర ద్విచక్ర వాహనాల నిందితుడిని అరెస్టు చేసి, ఏడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ సీఐ జయ నాయక్ తెలిపారు. శుక్రవారం పోలీస్ స్టేషన్లో నిందితుడి అరెస్టు వివరాలను తెలియజేశారు. బొమ్మనహాల్ మండల కేంద్రానికి చెందిన నాగరాజు విలాసాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దోచుకెళ్లి విక్రయించేవాడని తెలిపారు.