తేలికపాటి వర్షంతో వరి పంటకు ముప్పు
ASR: దిత్వా తుఫాన్ ప్రభావంతో డుంబ్రిగూడ మండల పరిసరాల్లో సోమవారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తుంది. తేలికపాటి వర్షం కురుస్తుండడంతో వరి పంట రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల కోత పూర్తయిన వరి కుప్పలను తడవకుండా రైతులు టార్పన్లతో కప్పి భద్రపర్చే పనిలో నిమగ్నమయ్యారు. వర్షం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గిరి రైతులు తెలిపారు.