సరిహద్దు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి
సరిహద్దు, తీర ప్రాంత రాష్ట్రాలు భద్రత, సరఫరా విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు. నౌకాయానం, నిత్యావసరాల రవాణాలో తలెత్తే సవాళ్లను వెనువెంటనే పరిష్కరించాలని కోరారు. ఇదే సమయంలో తప్పుడు సమాచారం, వదంతుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను అరికట్టాలని తెలిపారు. కేంద్రం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతాయని భరోసా ఇచ్చారు.