VIDEO: పాఠశాల భవనం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ASF: ఆసిఫాబాద్ మండలం వావుధం గ్రామంలో పాఠశాల భవనం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామ పంచాయతీ భవనంలో చదువుకుంటున్నారని DYFI జిల్లా అధ్యక్షుడు టీకానంద్ గురువారం ఆరోపించారు. వారు మాట్లాడుతూ.. కొత్త భవనం మంజూరైనా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు పునాది దశలోనే ఆగిపోయాయన్నారు. తక్షణమే పాఠశాల భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.