అంగన్వాడీ కేంద్రాలకు కూడా నేడు సెలవు..

VZM: భారీ వర్షాలు కారణంగా జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నతాధికారులు ఇవాళ సెలవు ప్రకటించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. సెలవును అధికారికంగా ప్రకటించకపోవడంతో యూనియన్ ప్రతినిధులు ఉన్నతాధికారులను సంప్రదించారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు స్పష్టం చేశారని ప్రతినిధులు తెలిపారు.