'వర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకోండి'

GNTR:ఆచార్య నాగార్జున వర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ANU AISF అధ్యక్షుడు నాసరయ్య అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే జిల్లాలో VIT, VVIT, SRM, AMRUTHA, KLU, VIGNAN వంటి వర్సిటీలతో పాటు BITS యూనివర్సిటీ శంకుస్థాపనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అధ్యాపకుల కొరత ఉన్న ANU అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు.