చరిత్ర పునరావృతం.. లుముంబా, డైమ్ సరసన ఖమేనీ
అమెరికా ప్రమేయంతో ప్రాణాలు కోల్పోయిన విదేశీ నేతల జాబితాలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చేరారు. గతంలో ప్యాట్రిస్ లుముంబా(కాంగో), న్గో దిన్ డైమ్(దక్షిణ వియత్నాం) వంటి వారు అమెరికా వ్యూహాల వల్ల హతమవ్వగా.. ఇప్పుడు టెహ్రాన్‌లో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఖమేనీ మరణించారు. ఇది అగ్రరాజ్యాల 'పాలనా మార్పు' వ్యూహాలకు నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.