మణుగూరు ఘటనను ఖండించిన ఎంపీ

మణుగూరు ఘటనను ఖండించిన ఎంపీ

KMM: మణుగూరులో జరిగిన ఘటనను బీఆర్‌ఎస్‌ ఎంపీ వద్ధిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో యుద్ధ వాతావరణం సృష్టించిందని, బీఆర్‌ఎస్‌ కార్యాలయంపై దాడులు జరిగినా పోలీసులు స్పందించలేదని ఆయన అన్నారు. దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని తిరిగి ఇవ్వాలని, కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వద్ధిరాజు రవిచంద్ర అన్నారు.