అంగన్‌వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
BDK: అశ్వారావుపేట రైతు వేదికలో మంగళవారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అంగన్‌వాడీ టీచర్లకు ఉచిత స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన ఈ ఫోన్లతో విధులు మరింత సులభతరం అవుతాయని ఆయన పేర్కొన్నారు. అనంతరం చిన్నారులకు దుస్తులు, పోషకాహార కిట్లను అందజేసి, అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు.