'రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి'
KMM: మధిర మండలంలో యాసంగి 2025-26 రైతు భరోసా పథకానికి కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి కనకం సాయిదీక్షిత్ ఇవాళ వెల్లడించారు. ఫిబ్రవరి 28 నాటికి ధరణి డేటా ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారని అన్నారు. అవసరమైన పత్రాలతో సంబంధిత ఏఈవోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.