'ఇలాంటి సమస్యలు ఆలస్యంగా తమ దృష్టికి వస్తున్నాయి'
HYD: హయత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి శారదనగర్ కాలనీలో పర్యటించారు. ఓ వీధిలో 200 మీటర్ల సీసీ రోడ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో అసౌకర్యం ఎదురవుతుందని కాలనీవాసులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సమస్యలు తమ దృష్టికి ఆలస్యంగా చేరుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరితగతిన సీసీ రోడ్ పనులు ప్రారంభించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు.