రోడ్డు మంజూరు చేయాలనీ కలెక్టర్‌కు వినతి

రోడ్డు మంజూరు చేయాలనీ కలెక్టర్‌కు వినతి

ASR: అనంతగిరి మండలం చివర్ల పంచాయతీ పరిధిలో గల నక్కలమాడి గ్రామస్తులు రోడ్డు మంజూరు చేయాలనీ సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి లేక ఐదు కిలోమీటర్లు నడిచి వెళ్లడం తప్పడం లేదన్నారు. ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే డోలి తప్పనిసరని వాపోయారు. అధికారుల స్పందించి మా గ్రామానికి రోడ్డు వేస్తారని విజ్ఞప్తి చేశారు.