VIDEO: మురుగు కాలువలో 'బంగారు' అన్వేషణ

VIDEO: మురుగు కాలువలో 'బంగారు' అన్వేషణ

JGL: పొట్టకూటి కోసం ఓ మహిళ పడుతున్న శ్రమ అందరినీ కదిలిస్తోంది. మల్యాల మండల కేంద్రంలోని స్వర్ణకారుల దుకాణాల ముందున్న మురుగు కాలువలో దుర్గంధాన్ని సైతం లెక్కచేయకుండా ఒక మహిళ మట్టిని తీస్తూ కనిపించింది. దుకాణాల నుండి మురుగులో కలిసిపోయే బంగారు రేణువుల కోసం ఆమె జల్లెడ పడుతూ గాలిస్తున్న దృశ్యం, పేదరికం ఏ స్థాయికి నెడుతుందోనన్న కఠిన వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది.