VIDEO: మొరం అక్రమ దందా… స్థానికుల ఆగ్రహం
WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని రిజర్వాయర్ నుంచి బుధవారం అర్ధరాత్రి వేళ JCB సహాయంతో ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా మొరం తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరును అడ్డుపెట్టుకుని వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలిపారు. అధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును నిలిపివేసి అక్రమ రవాణ చేస్తున్నా వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.