'చిన్న పిల్లలకు మావోయిస్టులు ఆయుధాలు ఇచ్చారు'
నక్సలైట్లకు ఆదర్శం భారతీయులు కాదని.. వారికి మావో ఆదర్శమని కేంద్రమంత్రి అమిత్ షా తెలిపారు. రోడ్లు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకుండా గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని నిలదీశారు. మావోయిస్టులు చిన్న పిల్లలకు తుపాకులు, ఆయుధ సామాగ్రి ఇచ్చారని మండిపడ్డారు. తద్వారా యువత జీవితాలు నాశనమయ్యాయని ధ్వజమెత్తారు. అందుకే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉందన్నారు.