కీసర శివాలయానికి పోటెత్తిన భక్తులు
ఎన్టీఆర్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కంచికచర్ల మండలం కీసర గ్రామంలో ఉన్న శివాలయానికి ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కూలైన్లలో బారులు తీరి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం మార్మోగుతోంది. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక ఏర్పాటు చేశారు.