పోలీస్ స్టేషన్‌లో 10వ తరగతి పరీక్ష పత్రాల భద్రత
KNR: హుజురాబాద్ మండలంలోని 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన 4 పరీక్ష కేంద్రాల పరీక్ష పత్రాలను హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో భద్రపరిచినట్టు ఎంఈఓ విడపు శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రూట్ ఆఫీసర్ రామయ్య, అసిస్టెంట్ రూట్ ఆఫీసర్ మురళి మనోహర్, పరీక్ష కేంద్రాల సూపరిండెంట్స్ సమ్మిరెడ్డి సత్య ప్రసాద్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ తదితరులు పాల్గొన్నారు.