VIDEO: భక్తులతో కిటకిటలాడిన మల్లప్ప కొండ.!
CTR: కార్తీక సోమవారం సందర్భంగా గుడిపల్లి మండలం మల్లప్ప కొండ భక్తులతో కిటకిటలాడింది. ఇందులో భాగంగా శ్రీ మల్లేశ్వర స్వామిని దర్శించుకునేందుకు స్థానికులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రంగా మారింది. అనంతరం కార్తీక సోమవారం సందర్భంగా మహిళలు దీపాలు పెట్టి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు.