నా వల్లే మ్యాచ్ ఓడిపోయాం: హ్యారీ బ్రూక్

నా వల్లే మ్యాచ్ ఓడిపోయాం: హ్యారీ బ్రూక్

భారత్ చేతిలో ఎదురైన ఓటమిపై ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. తన తప్పిదం వల్లే ఈ మ్యాచ్‌లో ఓడిపోయామని బ్రూక్ భావోద్వేగానికి గురయ్యాడు. సంజూ శాంసన్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను తను జారవిడిచి ఉండాల్సింది కాదన్నాడు. అదే తాను చేసిన అతిపెద్ద తప్పని వ్యాఖ్యానించాడు. బ్రూక్ క్యాచ్ మిస్ చేయడంతో సంజూ 89 పరుగులతో మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పేశాడు.