డీఎపీ కంటే లిక్విడ్ ఎంతో ఉపయోగకరం

అన్నమయ్య: ప్రతి పంటకు డీఏపీ చల్లకుండా లిక్విడ్ స్ప్రే చేస్తే మంచి దిగుబడులు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ నారాయణ తెలిపారు. శనివారం ''పొలం పిలుస్తోంది'' కార్యక్రమంలో భాగంగా చెంచర్లపల్లి, ఎర్రగుడి, మామిడిగారిపల్లి గ్రామాల్లోని వేరుశనగ, కంది, ఆముదం పంటలకు డీఏపీ లిక్విడ్ స్ప్రే చేయించారు.