ఆర్జీయూకేటి విద్యార్థిని మృతి పట్ల వర్సిటీలో సంతాపం

నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీలో పియూసీ సెకండ్ ఇయర్ విద్యార్థిని స్వాతి ప్రియ మృతిపై వర్సిటీ పరిపాలన భవనంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటుచేసిన సంతాప సభలో వీసీ ప్రొ.గోవర్ధన్,ఏఓ రణధీర్,అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.2 ని.లు మౌనం పాటించి నివాళులర్పించారు.ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థిని అకాల మృతి చెందడం బాధాకరమని వీసీ అన్నారు.