యువతపై దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

VZM: యువతపై దాడి చేసిన వ్యక్తిపై వంగర పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై షేక్ శంకర్ వివరాల ప్రకారం.. ఎం సీతారాంపురం గ్రామానికి చెందిన ఓ యువతో తన ఇంటి వద్ద బట్టలు ఉతుకుతున్న నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మడపల సారయ్య ఆమెపై దుర్భాషలాడుతూ దాడి చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.