పాక్ మిస్సైల్‌ను కూల్చిన భారత్

పాక్ దాడుల్ని భారత్ బలంగా తిప్పికొడుతోంది. ఈ క్రమంలో పాక్ ప్రయోగించిన ఫతాహ్-2 క్షిపణిని కూల్చివేసింది. హర్యానాలోని సిర్సాలో ఈ మిస్సైల్‌ను భారత్ పేల్చివేసింది. కాగా.. ఫతాహ్-2 క్షిపణి 400 కి.మీ. దూరంలోని టార్గెట్లను ఛేదించగలదు. దీని కూల్చివేతతో భారత రక్షణ వ్యవస్థ సామర్థ్యం మరోసారి స్పష్టమైంది. గగనతలంలో క్షిపణులు నిర్వీర్యం చేయగల సాంకేతికత భారత్‌కు ఉందని రుజువైంది.