VIDEO: మహనీయుల విగ్రహాలకు శంకుస్థాపన
కృష్ణా: మోపిదేవి మండలం బోడగుంటలో మహాత్మా జ్యోతిరావు పూలే, అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల శంకుస్థాపన గురువారం నిర్వహించారు. సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయుల విగ్రహాలు గ్రామంలో ఏర్పాటు కావడం గౌరవంగా భావించాలని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలపల్లి CI ఈశ్వర రావు, SI దుర్గా ఆంజనేయులు, CRPF మేజర్ శివ నాగరాజు, MRPS నాయకులు పాల్గొన్నారు.