మల్లన్న సన్నిధిలో కర్నూలు ఎంపీ

మల్లన్న సన్నిధిలో కర్నూలు ఎంపీ

NDL: మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆదివారం కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు కుటుంబ సమేతంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయానికి చేరుకున్న వీరికి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.