అమలాపురంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు దగ్ధం
కోనసీమ: పార్లమెంట్‌లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సభ్యులు వ్యవహరించిన తీరుపట్ల బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. దేశ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందన్నారు.