పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా.. 22 ఏళ్లకే సర్పంచ్

పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా.. 22 ఏళ్లకే సర్పంచ్

KMR: రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో యువత తమ సత్తా చాటారు. కామారెడ్డిలోని కళ్యాణి గ్రామంలో 22 ఏళ్ల నవ్య 901 ఓట్లతో సర్పంచ్‌గా భారీ మెజారిటీతో గెలుపొందారు. భూపాలపల్లిలోని దుబ్యాలలో 23 ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి అంజలి 41 ఓట్ల తేడాతో విజయం సాధించారు. యువత రాజకీయాల్లోకి వస్తున్నారని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.