సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
అల్లూరి: అరకు మండలం పద్మాపురం పంచాయతీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. సర్పంచ్ పెట్టెలి సుస్మితతో కలిసి అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పూజా కార్యక్రమాలు నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.3లక్షల 50 వేలతో 50 మీటర్ల సీసీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.