విద్యార్థికి రాష్ట్ర స్థాయి కవితా బహుమతి
NZB: మోపాల్ మండలం సిర్పూర్ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థిని యం. మేఘనకు తెలంగాణ సారస్వత పరిషత్తు, HYD వారి నుంచి రాష్ట్రస్థాయి ప్రత్యేక కవితా బహుమతి లభించింది. మేఘన రాసిన 'స్నేహం' అనే కవితకు ఈ గుర్తింపు దక్కినట్లు పాఠశాల హెచ్.ఎం. సత్యనారాయణ తెలిపారు. మెమెంటో, సర్టిఫికెట్, నగదు బహుమతిని మేఘనకు ఇవాళ అందజేశారు.