కోహ్లీని ఊరిస్తున్న అరుదైన రికార్డ్
సౌతాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డు సాధించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లీ మరో 337 పరుగులు చేస్తే అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి 28,000 పరుగులు చేసిన మూడో ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు సచిన్ (34,357), సంగక్కర (28,016) మాత్రమే ఈ ఘనతను సాధించారు.