రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

ELR: పెదవేగి మండలం ముండూరు సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని కొప్పులవారిగూడెం గ్రామానికి చెందిన చందన్ యాదవ్, మనోజ్ యాదవ్‌లు బైక్ పై స్నేహితులను కలిసేందుకు వెళ్తుండగా ముండూరు సమీపంలో బైక్ అదుపుతప్పి పాల వ్యానును ఢీకొట్టింది. ఈ ఘటనలో చందు యాదవ్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు.