'రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'
MHBD: రోడ్డు భద్రత నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ధీరజ్ కుమార్ తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో అవగాహన సమావేశం నిర్వహించారు. కారులో వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ పత్రాలను కలిగి ఉండాలన్నారు.