ఎన్నికల ముందు ప్రజలకు CM సందేశం
బీహార్‌లో ఈ నెల 6న తొలి విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు CM నితీశ్ కీలక సందేశమిచ్చారు. 2005 నుంచి CM పదవిలో ఉన్న తాను ఒకప్పటి దుర్బర పరిస్థితులను మెరుగుపరిచి, అన్ని రంగాల్లో కృషి చేశానని తెలిపారు. తన కుటుంబాన్ని పక్కన పెట్టి మరీ ప్రజల కోసమే పనిచేశానన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి NDA సర్కార్‌తోనే సాధ్యమని, మరోసారి తనకు అవకాశమివ్వాలని కోరారు.